TS: రేపటి నుండి బతుకమ్మ చీరల పంపిణీ

సిద్ధిపేట (CLiC2NEWS): జిల్లా లోని అన్ని గ్రామాలకు రేపటి( శనివారం) నుంచి బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టాలని ఆర్ధిక మంత్రి హారీశ్‌రావు అన్నారు. ఆయన ఈరోజు (శుక్రవవారం) ప్రజా ప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈకార్యక్రమంలో బతుకమ్మ , దసరా పండుగ ఏర్పాట్లు, బతుకమ్మ చీరల పంపిణీ తదితర అంశాల గురించి చర్చించారు. ఈసందర్భంగా హారీశ్ రావు మాట్లాడుతూ.. బతుకమ్మ చీరల పంపిణీ పండుగలా జరగాలని అన్నారు. మూడా రోజుల్లో చీరెల పంపిణీ కార్యక్రమం పూర్తి కావాలని సూచించారు. బతుకమ్మ చీరలు 289 వర్ణాలతో 17డిజైన్లతో మహిళలు మెచ్చే విధంగా సరికొత్తగా సిద్ధమయ్యాయని అన్నారు.