TS: ఈనెల 30 నుండి ఎంసెట్ కౌన్సెలింగ్
హైదరాబాద్ (CLiC2NEWS) : రాష్ట్రంలో EAMCET2021 మొదటి దశ ప్రవేశాల కౌన్సెలింగ్ ఈనెల 30వ తేదీనుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 30 నుండి సెప్టెంబరు 9వ తేదీ వరకు ధ్రవపత్రాల స్లాట్ బుకింగ్ చేపడుతున్నట్టు TSEAMCET-2021 కమిటీ మంగళవారం ప్రకటించింది. సెప్టెంబరు 4 నుండి 11వ తేదీ విద్యార్థుల ధ్రువపత్రాలు పరశీలన ఉంటుంది. సెప్టెంబరు 13 వ తేదీ వరకు వెబ్ఆప్షన్ల నమోదు ఉంటుందని తెలిపారు. సెప్టెంబరు 15 వ తేదీన మొదటి విడత సీట్ల కేటాయింపు జరుగుతుంది. సెప్టెంబరు 15 నుండి 20వ తేదీలోగా సీట్లు పొందిన విద్యార్థులు కళాశాలలో ఆన్‌లైన్ రిపోర్టింగ్ చేయాల్సిఉంటుంది. మరిన్ని వివరాలు https://tseamcet.nic.in లో ఈనెల 28వ తేదీ నుండి పొందవచ్చని అడ్మిషన్స్ కన్వీనర్ తెలిపారు.