TS EMCET: దరఖాస్తు గడువు పొడిగింపు
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2021 దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు విజ్ఞప్తి మేరకు ఎంసెట్ దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు టీఎస్ ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్ వెల్లడించారు. ఈ నెల 26వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు అని ఒక ప్రకటన విడుదల చేశారు.