TS High Court: న్యాయవాదులను అడ్డుకోవద్దు..

హైదరాబాద్ (CLiC2NEWS): న్యాయవాదులను అడ్డుకోవద్దని తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. లాక్‌డౌన్ సమయంలో న్యాయవాదులకు బార్ కౌన్సిల్ గుర్తింపు కార్డు ఉంటే వారిని, వారి క్లర్కులు, స్టెనోలను కూడా న్యాయవాది ఇచ్చిన సర్టిఫికెట్ ఉంటే వారిని కూడా అనుమతించాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్‌తో సహా ఇతర రాష్ట్రాలనుండి న్యాయవాదుల రాకపోకలను అడ్డుకోవద్దని సూచించింది. అయితే ఈ అవకాశాన్ని న్యాయవాదులు దుర్వినియోగం చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.