TS: లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డ అధికారి!
కరీంనగర్ (CLiC2NEWS): కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్‌లో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్‌లో ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కాంట్రాక్టర్ వద్ద నుండి రూ. 17 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కారు. మున్సిపల్ కార్పోరేషన్‌లో అతనికి సంబంధించిన హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్ ఇండ్లలో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.