రేపు టిఎస్ పాలిసెట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్ (CLiC2NEWS): టిఎస్ పాలిసెట్ -2022 ఫలితాలు బుధవారం ఉదయం 11.30 గంటలకు విడుదల కానున్నాయి. ఈ మేరకు నాంపల్లిలోని టెక్నికల్ ఎడ్యూకేషన్ కమిషనర్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ కాన్ఫరెన్స్ హాలులో ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు టిఎస్ పాలిసెట్ అధికారులు మీడియాకు వెల్లడించారు. జూన్ 30న తెలంగాణ వ్యాప్తంగా పాలిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహిచిన సంగతి తెలిసిందే.