అయ్యప్ప భక్తులకు టిఎస్ ఆర్‌టిసి శుభవార్త
హైదరాబాద్ (CLiC2NEWS): డిసెంబర్, జనవరి నెలల్లో శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు టిఎస్ ఆర్ టిసి శుభవార్త నందించింది. రాయితీపై ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక బస్సులు అయ్యప్ప స్వాములు వారు కోరుకున్నప్రదేశం నుండి దర్శించవలసిన పుణ్యక్షేత్రాల వరకు నడుపబడును. ఎలాంటి డిపాజిట్ లేకుండా 10% రాయితీపై సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులను ఏర్పాటు చేస్తామని ఆర్టిసి ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ ప్రకటించాడు. బస్సులలో ముందస్తు బుకింగ్, సీట్ రిజర్వేషన్ కొరకు, శబరిమల యాత్రకు కావలసిన ఆర్టిసి బస్ అద్దె బుకింగ్ కొరకు వెబ్‌సైట్, ఫిర్యాదుల కొరకు కాల్ సెంటర్ 040 23450033, 69440000 నెంబర్లను సంప్రదించాలని సూచించింది.
Hi! Someone in my Myspace group shared this website with us so I came to give it a look. I’m definitely enjoying the information. I’m book-marking and will be tweeting this to my followers! Terrific blog and great style and design.