TS: ములుగు జిల్లాలో ఇద్దరు మవోయిస్టుల మృతి

ములుగు (CLiC2NEWS): పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదుకాల్పులలో ఇద్దురు మావోయిస్టులు మృతిచెందారు. వెంకటాపురం మండలం కర్రగుట్ట అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. గ్రేహౌండ్స్ కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. తెలంగాణ-ఛత్తీస్గఢ్ బీజాపూర్ సరిహద్దులో ఉన్న కర్రగుట్ట అటవీ ప్రాంతంలో సాయుధ దళాలు ఆపరేషన్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది,