శివరాత్రికి ప్రత్యేక బస్సులు.. టిఎస్ఆర్‌టిసి
హైదరాబాద్ (CLiC2NEWS): మహా శివరాత్రి సందర్భంగా తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులు నడపనుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలనుండి 40 శైవక్షేత్రాలకు.. మొత్తం 2,427 బస్సులు నడుపుతున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఈ నెల 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
శ్రీశైలంకు 578 బస్సులు, వేముల వాడకు 481, ఏడుపాయలకు 497, కీసరగుట్టకు 239, వేలాలకు 108, కాళేశ్వరానికి 51, కొమురవెల్లికి 52, కొండగట్టుకు 37, అలంపూర్ 16, రామప్పకు 15, ఉమామహేశ్వారానికి 14 బస్సులను నడపనున్నారు. వీటి ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కూడా కల్పించారు. శ్రీశైలం వెళ్లాలనుకునే భక్తులకు హైదరాబాద్ నగరంలోని ఎంజిబిఎస్, దిల్‌సుఖ్‌నగర్, జెబిఎస్ ఐఎస్ సదన్, కెపిహెచ్‌బి కాలని, బిహెచ్ ఇ ఎల్ నుండి బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అదేవిధంగా అద్దె బస్సులపై 10% రాయితీని కల్పిస్తున్నట్లు తెలిపారు.