AP: టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రమాణస్వీకారం
తిరుమల (CLiC2NEWS) : తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి రెండవసారి బాధ్యతలు చేపట్టారు. ఈయన బుధవారం శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. మొదటిసారి ఆయన 2019జూన్ 19న టిటిడి ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. స్వామివారి ప్రథమ సేవకుడిగా రెండోసారి అవకాశం రావడం తన పూర్వజన్మ అదృష్టమని అన్నారు. ఆయన పదవీకాలం ఈఏడాది జూన్ 21వ తేదీన ముగియడంతో టిటిడి పర్యవేక్షణకు ఎపి ప్రభుత్వం స్సెసిఫైడ్ ఆథారిటీని ఏర్పాటు చేసింది. వైవీ సుబ్బారెడ్డిని రెండసారి ఛైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో టిటిడి బోర్డు సభ్యుల నియామకం ఉంటుందని ప్రకటన చేసింది.