తిరుమలలో ఇకనుండి రాత్రి అన్న ప్రసాదంలోనూ వడలు..
తిరుమల (CLiC2NEWS): ఇప్పటి వరకు తిరుమలలో మధ్యాహ్న భోజనంలో మాత్రమే వడలు వడ్డించేవారు. అయితే, ఇక నుండి రాత్రి భోజనంలో కూడా వడలు వడ్డించాలని నిర్ణయించారు. దానికి సంబందించిన ఏర్పాట్లు చేపట్టింది. తిరుమలలోని తిరగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడు ఆదివారం సాయంత్రం వడల పంపిణీ ప్రారంభించారు. ఆయన స్వయంగా భక్తులకు వడలను వడ్డించారు. తిరుమలలో రోజూ ఉదయం 11 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అన్న ప్రసాదంలో భక్తులకు వడలు అందించనున్నారు. ఇందుకోసం రోజుకు సుమారు 70 వేల నుండి 75 వేల వరకు వడలను తయారు చేయనున్నారు.