`అనంత`లో విద్యుదాఘాతంతో అన్నదమ్ముల మృతి

అనంతపురం (CLiC2NEWS): అనంతపురం జిల్లాలో విద్యుదాఘాతంతో అన్నదమ్ములు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని డి.హారేహాల్ మండలం చెర్లోపల్లిలో ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు చెర్లోపల్లికి చెందిన రామచంద్ర (45), గంగన్న (43) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శనివారం అర్థరాత్రి పాకలో ఎద్దుల అరుపులు వినరావడంతో పెద్దోడు రమాచంద్ర పాకలోకి వెళ్లాడు. విద్యుత్ తీగలు పాక రేకులకు తగిలి విద్యుత్ సరఫరా అయింది. ఈ క్రమంలో అటుగా వెళ్లిన రామచంద్ర విద్యుత్‌షాక్‌తో అక్కడిక్కడే మృతి చెందారు. అన్నం ఎంతకీ రాకపోవడంతో తమ్ముడు గంగగన్న పాకలోకి వెళ్లాడు. ఆయన కూడా విద్యుత్ షాక్‌తో చనిపోయారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు విద్యుత్ సరఫరాను నిలిపి వేసి పశువులను బయటకు తీసుకొచ్చారు. ఇద్దరు అన్నదమ్ములు మృతిచెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.