న‌ల్గొండ జిల్లాలో కెటిఆర్‌పై రెండు కేసులు న‌మోదు

న‌ల్గొండ (CLiC2NEWS): జిల్లాలో బిఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు, మాజి మంత్రి కెటిఆర్‌పై కేసులు న‌మోద‌య్యాయి. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష మాస్ కాపీయింగ్ ఘ‌ట‌న‌పై ఎక్స్ పోస్టులు ఫార్వార్డ్ చేశార‌ని మున్సిప‌ల్ ఛైర్‌ప‌ర్స‌న్ ర‌జిత ఫిర్యాదు చేశారు. దీంతో ఎ1గా మ‌న్నే క్రిశాంక్‌, ఎ2గా కెటిఆర్‌, ఎ3గా దిలీప్ కుమార్‌పై కేసు న‌మోదైంది. ఉగ్గ‌డి శ్రీ‌నివాస్ ఇచ్చిన మ‌రో ఫిర్యాదుతో కెటిఆర్‌పై మ‌రో కేసు న‌మోదైంది. బిఆర్ ఎస్ సోష‌ల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఫార్వార్డ్ చేశార‌ని.. ఎక్స్‌లో త‌మ‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేశార‌ని వారు ఫిర్యాదు చేశారు.

Leave A Reply

Your email address will not be published.