రేణిగుంట‌లో రోడ్డు ప్ర‌మాదానికి గురై ఇద్ద‌రు హైదరాబాద్ వాసులు మృతి

రేణిగుంట‌ (CLiC2NEWS): హైద‌రాబాద్‌లోని ప‌టాన్‌చెరుకు చెందిన దంప‌తులు రేణిగుంట‌లో రోడ్డు ప్ర‌మాదానికి గుర‌య్యారు. తిరుప‌తి జిల్లా రేణిగుంట స‌మీపంలో సోమ‌వారం వీరు ప్ర‌యాణిస్తున్న కారు ప్రైవేటు బ‌స్సును ఢీక‌ట్టింది. దీంతో సందీప్‌, అంజలీ దేవి దంప‌తులు ప్రాణాలు కోల్పోయారు. తిరుప‌తి నుండి హైద‌రాబాద్‌కు వ‌స్తున్న క్ర‌మంలో వీరి వాహ‌నం రేణిగుంట స‌మీపంలోని కుక్క‌ల‌దొడ్డి వ‌ద్ద ప్రమాదానికి గురైంది.

Leave A Reply

Your email address will not be published.