ఛత్తీస్‌గఢ్‌ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోలు హతం

సుక్మా (ఛ‌త్తీస్‌గ‌ఢ్‌) (CLiC2NEWS): ఆంధ్రా ఒడిశా బోర్డర్‌ పరిధిలోని సుక్మా జిల్లాలోని గోంపాడ్‌-కన్హాయిగూడ ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. సుక్మా జిల్లా ఎస్పీ సునీల్‌ శర్మ తెలిపిన వివరాల ప్రకారం..

మావోయిస్టుల కదలికలపై విశ్వ‌స‌నీయ సమాచారంతో గోంపాడ్‌-కన్హాయిగూడ ప్రాంతంలో పోలీసులు మంగళవారం ఉదయం జాయింట్‌ ఏరియా ఆపరేషన్‌ను చేపట్టారు. ఇవాళ ఉదయం మావోయిస్టులకు, పోలీసు దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల అనంతరం ఆ ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసు దళాలకు ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు లభించాయి. మృతుల్లో కొంటా ఏరియా కమాండ్‌ కవాసి హుంగా కూడా ఉన్నారు. ఘటనాస్థలంలో మావోయిస్టుల ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పరారైన మావోల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ సునీల్ తెలిపారు. అలాగే ఎదురుకాల్పుల్లో మరికొంతమంది మావోయిస్టులు గాయపడి ఉండవచ్చుననే అనుమానాన్ని వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.