తెలంగాణకు రెండు మెడికల్ కాలేజీలు మంజూరు: మంత్రి హరీశ్‌రావు
![](https://clic2news.com/wp-content/uploads/2022/10/HARISH-RAO.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో మరో రెండు వైద్య కళాశాలలు మంజూరయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కామారెడ్డి, కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో మెడికల్ కాలేజీలకు అనుమతి వచ్చిందన్నారు. ఒక్కో కళాశాలలో 100 చొప్పున సీట్లతో అనుమతి లభించినట్లు వెల్లడించారు. రాష్ట్రానికి సంబంధించి మరో ఏడు వైద్య కళాశాలలు అనుమతుల ప్రక్రియ వివిధ దశల్లో ఉందన్నారు. ఆరోగ్య తెలంగాణలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవల బలోపేతానికి ఆస్కారం కలుగుతుందని.. వైద్య విద్యార్థులకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు.