మంచిర్యాల జిల్లాలో ఇద్దరు సూడో నక్సల్స్ అరెస్టు
మంచిరియాల్ (CLiC2NEWS): నక్సలైట్స్మని చెప్పి, ఎయిర్ గన్స్ తో బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు .సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై రవి కుమార్ సిబ్బందితో కలిసి తోళ్లవాగు సమీపంలో వాహన తనిఖీ నిర్వహించగా.. ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో ద్విచక్రవాహనంపై పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించారు. వారి వద్ద నుండి రెండు ఎయిర్ గన్స్, ఒక మోటర్ సైకిల్, మొబైల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలపిన వివరాల ప్రకారం..
నిందితులు మేడి.వెంకటేష్, ఆరేందుల.రాజేష్ చిన్నపటి నుండి మిత్రులు. గత కొంత కాలంగా ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ఈ మధ్య రియల్ ఎస్టేట్ సరిగా లేక ఇద్దరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో వెంకటేష్, రాజేష్ సులువుగా డబ్బులు సాధించాలని ఆలోచనతో ఎవరినైనా అమాయకులని నక్సలైట్ ల పేరు తో ఫోన్ లో బెదిరించి డబ్బులు వసూలు చేయాలనీ ఆలోచించి.. కొన్ని రోజుల క్రితం రాజేష్ చెప్పిన ప్రకారం వెంకటేష్ హైదరాబాద్ నుండి రెండు ఎయిర్ గన్స్ కొనుగోలు చేసి, నక్సలైట్ పేరు తో మాట్లాడానికి గుర్తు తెలియని వ్యక్తి వద్ద నుండి ఫోన్, సిమ్ కొనుగోలు చేసారు. తరువాత నస్పూర్ లో కాంతయ్య ఇంటి వద్ద రెక్కీ చేసి, గత నెల ఫిబ్రవరి 21 నాడు రాత్రి సమయంలో వెంకటేష్ తన పల్సర్ బండి మీద రెండు ఎయిర్ గన్స్ ని సంచిలో పెట్టుకొని వచ్చి అర్దరాత్రి సమయంలో కాంతయ్య ఇంటి ఆవరణలో పడవేసి తిరిగి తన ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు తెల్లవారు జామున రాజేష్, వెంకటేష్ లు కలిసి కాంతయ్య, మరియు అతని కొడుకు నాగరాజుల కి ఫోన్ చేసి తిర్యాణి అడవుల నుండి నక్సలైట్ లము మాట్లాడ్తున్నాం, మీ ఇంటి ముందు తుపాకులు పెట్టాం, మీరు 40 లక్షలు ఇవ్వకపోతే మీ కుటుంబ సభ్యులను అందరిని చంపుతాం అని బెదిరించారు. బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మంచిర్యాల రూరల్ సీఐ సంజీవ్ ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞాన విధానంలో దర్యాప్తు చేయగా నింధితుల ఇద్దరినీ అరెస్ట్ చేయడం జరిగింది. రాజేష్ మీద గతంలో మంచిర్యాల , హాజీపూర్ ఏరియాలలో పలు కేసులు నమోదయ్యాయి.
నిందితులను పట్టుకోవడానికి సహకరించిన పోలీసు సిబ్బందిని సిపి రెమా రాజేశ్వరి అభినందించారు.