సిద్దిపేట రిజర్వాయర్‌లో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి

చిన్నకోడూరు (CLiC2NEWS): సిద్దిపేట జిల్లాలోని చిన్న కోడూరు మండలంలో నీట మునిగి ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వరంగల్ కు చెందిన రెండు కుటుంబాలు హైదరాబాద్‌కు బయలుదేరారు. మార్గమధ్యమంలో రంగనాయక్ సాగర్ వద్ద ఆగారు.. సరదాగా ఈత కొడుతున్న విరాజ్, అర్బాస్ లు నీట మునిగారు. కొంతసేపటి తర్వాత గుర్తించిన కుటుంబ సభ్యులు.. పిల్లల కోసం ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. అనంతరం మిరాజ్ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు , అగ్నిమాపక సిబ్బది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అర్బాస్ మృతదేహం కోసం గాలిస్తున్నారు.