Mancherial: తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలి

మంచిర్యాల (CLiC2NEWS): పట్టణంలో ద్విచ‌క్ర వాహ‌న‌దారులు త‌ప్ప‌నిస‌రిగా హెల్మెట్ ధ‌రించాల‌ని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. స్థానిక‌
ఐబి చౌరస్తా వద్ద ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ ఆధ్వర్యంలో హెల్మెట్ మ‌రియు ట్రాఫిక్ రూల్స్‌ అవగాహన కార్యక్రమంలో భాగంగా శ్రీ చైతన్య స్కూల్ మంచిర్యాల విద్యార్థిని విద్యార్థుల‌తో వినూత్న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ‘SAVE LIFE’ అనే నినాదం తో విద్యార్థులు టీ షర్ట్స్ మరియు హెల్మెట్ ధరించి అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. హెల్మెట్‌ ధరించని వాహనదారులకు విద్యార్థుల‌తో గులాబీ పువ్వు ఇప్పించి, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె. నరేష్ కుమార్ అవగాహన కల్పించారు. ఈ సంద‌ర్భంగా హెల్మెట్ ధ‌రించాల‌ని.. మద్యం తాగా, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహ‌నం న‌డ‌ప‌రాద‌ని సూచించారు. ద్విచక్ర వాహనంపై ముగ్గురు వెళ్లరాదని.. ట్రాఫిక్‌ జంక్షన్‌ల వద్ద, సిగ్నల్స్‌ల వద్ద నిబంధనలను అతిక్రమించరాదన్నారు. మితిమీరిన వేగంతో వాహనం నడిపేవారిపై చట్టపరంగా జరిమానాలు విధించనున్నట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.