అక్కడేముంది ఆక్రమించుకోవడానికి.. శిథిలాలు తప్ప..!: జెలన్స్కీ
కీవ్ (CLiC2NEWS): రష్యా కాల్పుల కారణంగా మేరియపోల్ నగరం పూర్తిగా ధ్వంసమైందని ఉక్రెయిన్ అధ్యక్షడు జెలన్స్కీ అన్నారు. శిథిలాలు తప్ప అక్కడేముంది ఆక్రమించుకోవడానికి. అక్కడ మిగిలింది ఒక్క స్టీల్ ప్లాంట్ మత్రమే అంటూ జెలెన్స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యా మొదటినుండి మేరియుపొల్పై బాంబులతో దాడిచేస్తుంది. ఇక అక్కడ మిగిలింది స్టీల్ ప్లాంట్ మాత్రమే. దాంట్లో 200 మంది పౌరులున్నట్లు తెలుస్తోంది. కాగా, ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఈ యుద్ధం కారణంగా రెండు దేశాలకు తీవ్ర నష్టాలను కలిగిస్తుంది. దీని ప్రభావం ప్రపంచ దేశాలపైనా పడుతోంది.
ఉక్రెయిన్ అధ్యక్షడు జెలన్స్కీ ఆదివారం అమెరికా అధ్యక్షుడు జొబైడెన్తో వర్చువల్గా సమావేశం కానున్నారు. జర్మనీ ఛాన్సలర్ అధ్యక్షతన జరగనున్న జి7 సమావేశంలో బైడెన్ పాల్గొననున్నారు. ఈ సమావేశానికి జెలెన్స్కీ హాజరుకానున్నారు.