వర్షాలకు కూలిన నిర్మాణంలో ఉన్న భవనం.. శిధిలాల కింద 17 మంది!

బెంగళూరు (CLiC2NEWS): ఇటీవల కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల వంతెనలు, భవనాలు కూలిపోతున్నాయి. తాజాగా బెంగళూరులో నిర్మాణంలో ఉన్న ఓభవనం కూలిపోయింది. ఈ భవన శిథిలాల కింద కనీసం 17 మంది చిక్కుకున్నట్లు సమాచారం. తూర్పు బెంగళూరులోని బాబుసపల్య వద్ద సాయంత్రం 4.10 గంటలకు ఈ ఘటన జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు , అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి ఇప్పటి వరకు ముగ్గురిని రక్షించినట్లు సమాచారం.