AP: నేడు శ్రీశైల మల్లిఖార్జున స్వామిని దర్శించుకోనున్న అమిత్‌షా

హైదరాబాద్ (CLiC2NEWS) : కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్‌షా గురువారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా ఆయన శ్రీశైల మల్లిఖార్జున స్వామిని దర్శించుకోనున్నారు. ఆయన ఇవాళ ఉదయం హైదరాబాద్ బేగంపేట విమనాశ్రయం చేరుకున్న తర్వాత ప్రత్యేక హెలికాప్టర్‌లో శ్రీశైలంకు వెళతారు. అనంతరం సున్నిపెంటకు వెళ్లనున్నారు. శ్రీభ్రమరాంబ మల్లిఖార్జునస్వామి దర్శనానంతరం తిరిగి హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళతారు.