సిక్కుల పవిత్ర గ్రంథాలను మోసుకెళ్లిన కేంద్ర మంత్రి హరిదీప్
న్యూఢిల్లీ (CLiC2NEWS): సిక్కు మతంలో గురు గ్రంథ్ సాహిబ్ కు విశిష్ట స్థానం ఉంది. ఆ గ్రంధాలను బ్రతికి ఉన్న గురువులుగా వాళ్లు భావిస్తారు. ఆ గ్రంథాల్లో ఉన్న గుర్బానీలు.. అంటే పది మంది సిక్కు గురువులు బోధించిన సూత్రాలు ఆ పవిత్ర గ్రంధాల్లో ఉంటాయి. సిక్కు మత వ్యవస్థాపకుడు గురు నానక్ దేవ్ బోధనలు కూడా ఆ గ్రంథాల్లో నిక్షిప్తం అయ్యాయి. అయితే ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పైశాచికం పెరిగిపోవడంతో.. కాబూల్ నుంచి ప్రత్యేక విమానంలో 3 సిక్కు గ్రంథాలను తీసుకువచ్చారు. అయితే ఇవాళ ఢిల్లీ విమానాశ్రయంలో ఆ సరూపాలను మంత్రి హరిదీప్ అందుకున్నారు. ఆ గ్రంథాలను తలపై పెట్టుకుని ఆయన విమానాశ్రయం బయటకు వచ్చారు.
అఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చిన ప్రత్యేక విమానంలో 46 మంది సిక్కులు కూడా ఆఫ్ఘన్ నుంచి ఇండియాకు తిరిగొచ్చారు. ఆఫ్ఘన్ ప్రాంతంతో సిక్కులకు విడదీయరాని అనుబంధం ఉంది. ఆ దేశంలోనే గురు గ్రంథ్ సాహిబ్‌కు చెందిన 13 సరూపాలు అక్కడే ఉన్నాయి. అయితే ఇప్పటికే ఏడు గ్రంథాలను భారత్‌కు తరలించారు. తాజాగా 3 గ్రంథాలను తీసుకువచ్చారు. ఇంకా మిగితా 3 పవిత్ర గ్రంథాలు అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది.
ਵਾਹੁ ਵਾਹੁ ਬਾਣੀ ਨਿਰੰਕਾਰ ਹੈ
ਤਿਸੁ ਜੇਵਡੁ ਅਵਰੁ ਨ ਕੋਇ ।।ਕੁਝ ਸਮਾਂ ਪਹਿਲਾਂ ਕਾਬੁਲ ਤੋਂ ਦਿੱਲੀ ਆਏ ਸ੍ਰੀ ਗੁਰੂ ਗ੍ਰੰਥ ਸਾਹਿਬ ਜੀ ਦੇ ਤਿੰਨ ਪਵਿੱਤਰ ਸਰੂਪ ਪ੍ਰਾਪਤ ਕਰਨ ਅਤੇ ਉਨ੍ਹਾਂ ਨੂੰ ਮੱਥਾ ਟੇਕਣ ਦੀ ਬਖਸ਼ਿਸ਼ ਪ੍ਰਾਪਤ ਹੋਈ |
@narendramodi @PMOIndia @AmitShah @MEAIndia pic.twitter.com/dMalyCkMEQ
— Hardeep Singh Puri (@HardeepSPuri) August 24, 2021