Parigi: పరిశుభ్రతే ప్రధాన లక్ష్యంగా పట్టణ ప్రగతి..
పరిగి (CLiC2NEWS): పరిశుభ్రత, పచ్చదనమే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె,పట్టణ ప్రగతి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. వీధుల శుభ్రత, మెరుగైన పారిశుధ్యం, భవన నిర్మాణ వ్యర్థాల తొలగింపు, వరద సాఫీగా వెళ్లేలా చేయడం, శిథిల భవనాల కూల్చివేతతోపాటు హరితహారంలో భాగంగా లక్షలాది మొక్కలకు ఈ ‘ప్రగతి’ యజ్ఞంలో ప్రాణం పోయనున్నారు.

పరిగి మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డు పట్టణ ప్రగతి కార్యక్రమం కౌన్సిలర్ అర్చన రవికుమార్ ఆధ్వర్యంలో సోమవారం జరిగింది. పట్టణ ప్రగతిలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. పవర్ సప్లకి సంబంధించి వార్డు పరిధిలో లూజ్‌లైన్‌లో పరిగి కరెంట్ AE షేక్ ఖాజా బాబు, ఇతర సిబ్బంది బాగు చేశారు. అలాగే మూసుకుపోయిన నాలాలను జెసిబి తో క్లియర్ చేశారు. వార్డులో పేరుకు పోయిన చెత్తను తొలగించారు. ఈ కర్యక్రమంలో వార్డు కౌన్సిలర్ అర్చన రవి కుమార్, వార్డ్ స్పెషల్ ఆఫీసర్ చంద్రకళ, ఆశ వర్కర్, లైనమన్, కాలనీ నాయకులు చంద్రశేఖర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.