కామారెడ్డి మున్సిపల్ ఛైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన ఇప్ప ఉమారాణి

కామారెడ్డి (CLiC2NEWS) : కామారెడ్డి మున్సిపల్ ఛైర్ పర్సన్ గా ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ ముదిరాజ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కేంద్రం లోని మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అడిషనల్ కలెక్టర్ మధుమోహన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ శెట్కార్ ల సమక్షంలో ఛైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి బాధ్యతలు స్వీకరించి తొలి సంతకం చేశారు. తదనంతరం జరిగిన సమావేశంలో షబ్బీర్ అలీ, సురేష్ శెట్కార్ లు మాట్లాడుతూ ప్రభుత్వం తరుపున రావాల్సిన నిధులు కామారెడ్డి మున్సిపాలిటీ కోసం వచ్చేలా కృషి చేస్తామని తద్వారా భవిష్యత్తులో కామరెడ్డిని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని తెలిపారు.
మున్సిపల్ ఛైర్ పర్సన్ ఉమారాణి మాట్లాడుతూ రాజకీయాలతో సంబంధం లేకుండా అందరి కౌన్సిలర్లతో కలిసి కామారెడ్డి మున్సిపాలిటీని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, డీఈ, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.