ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి రాజీనామా

ఉత్తరాఖండ్ (CLiC2NEWS): ఉత్తరాఖండ్ సిఎం తీరత్ సింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్ బేబీ రాణి మౌర్యకు సమర్పించారు. శుక్రవారం ఉదయమే భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో తీరత్ సింగ్ సమావేశమైనారు. ఉత్తరాఖండ్లో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడకుండా ఉండేందుకే తీరత్ సింగ్ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 4 నెలలకే తీరత్ సింగ్ రాజీనామా చేయడం గమనార్హం.