ఉత్తరాఖండ్​ ముఖ్యమంత్రి రాజీనామా

ఉత్త‌రాఖండ్ (CLiC2NEWS): ఉత్త‌రాఖండ్ సిఎం తీర‌త్ సింగ్ రావ‌త్ త‌న ప‌దవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖ‌ను గవర్నర్​ బేబీ రాణి మౌర్య‌కు స‌మ‌ర్పించారు. శుక్ర‌వారం ఉద‌య‌మే భార‌తీయ జన‌తాపార్టీ జాతీయ అధ్య‌క్షుడు జెపి న‌డ్డాతో తీర‌త్ సింగ్ స‌మావేశ‌మైనారు. ఉత్త‌రాఖండ్‌లో రాజ్యాంగ సంక్షోభం ఏర్ప‌డ‌కుండా ఉండేందుకే తీర‌త్ సింగ్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ట్లు తెలుస్తోంది. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన 4 నెల‌ల‌కే తీర‌త్ సింగ్ రాజీనామా చేయ‌డం గ‌మ‌నార్హం.

Leave A Reply

Your email address will not be published.