నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి యువరాజ్‌ సాయం

నిజామాబాద్ (CLiC2NEWS): టీమిండిమా మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ ఆధ్వ‌ర్యంలోని యువికెన్ ఫౌండేష‌న్ ద్వారా నిజామాబాద్ ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో 120 ఐసియు బెడ్లు అందుబాటులోకి వ‌చ్చాయి. ఈ ఐసీయూ బెడ్లను యువీ బుధ‌వారం వర్చువల్‌గా ప్రారంభించాడు.

ఈ సంద‌ర్భంగా యువి మాట్లాడుతూ.. “యువికెన్ ఫౌండేష‌న్ ద్వారా దేశ వ్యాప్తంగా రూ.2.5 కోట్ల తో ఐసియు ప‌డ‌క‌లు ఏర్పాటు చేయ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నాం. కొవిడ్‌పై పోరుకు యువికెన్ ఫౌండేష‌న్ త‌ర‌ఫున స‌హ‌కారం అందిస్తున్నాం. వైద్య క‌ళాశాల‌ల్లో వెయ్యి ప‌డ‌కు యువికెన్ ఫౌండేష‌న్ ల‌క్ష్యం. ఇందులో భాగంగానే నిజ‌మాబాద్ ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో ఐసియు ప‌డ‌క‌లు ఏర్పాటు చేశాం“ అని పేర్కొన్నారు.

ఈ సిక్సర్ల వీరుడు.. గతంలో కూడా ఇలాంటి సహాయాలు చాలా చేశాడు. ఈ ఏడాది మే నెలలో తన ఫౌండేషన్‌ పేరిట మధ్యప్రదేశలోని ఇండోర్‌లో మూడున్న కోట్ల వ్యయంతో 100 పడకల ఆసుపత్రిని నిర్మించి ఇచ్చాడు.

Leave A Reply

Your email address will not be published.