జమ్మికుంటలో గొర్రెల పంపిణీని ప్రారంభించిన మంత్రులు త‌ల‌సాని, కొప్పుల‌

జమ్మికుంట‌ (CLiC2NEWS): జమ్మికుంట మార్కెట్ యార్డులో బుధ‌వారం రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, కొప్పుల ఈశ్వర్‌ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా 500 మంది లబ్ధిదారులకు గొర్రె యూనిట్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం ముఖ్య‌మంత్రి కెసిఆర్ చిత్త శుద్ధితో కృషి చేస్తున్నారని మంత్రి అన్నారు. తెలంగాణ మాదిరి పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవ‌ని మంత్రులు పేర్కొన్నారు. బీజేపీ నాయకులకు దమ్మంటే గొర్రెల పంపకం వంటి ఒక్క పథకాన్ని అమలు చేయాలని సవాల్‌ విసిరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయ‌కులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.