తిరుమలలో 10 నుండి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనం..

తిరుమల (CLiC2NEWS): తిరుమలలో జనవరి 10 నుండి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిపై టిటిడి ఇఒ జె. శ్యామలరావు, అదనపు అదనపు ఇవొ సిహెచ్ వెంకయ్యతో కలిసి సమీక్ష నిర్వహించారు. అన్నమయ్య భవన్‌లో అన్ని విభాగాల అధిపతులతో సమావేశం నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
డిసెంబర్ 23 ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల శ్రీవాణి టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
24 ఉదయం 11 గంటలకు ఎస్ఇడి టోకెన్లు విడుదల
10 రోజులకు గాను తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో ఒక కేంద్రంలో సర్వదర్శనం టోకెన్లు కేటాయింపు
తిరుపతిలోని ఎం.ఆర్.పల్లి, జీవకోన, రామానాయుడు స్కకూల్, ఇందిరా మైదానం, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం, విష్ణ నివాసం, తిరుమలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో టోకెన్ల కేటాయింపు.
వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 4.45 గంటలకు ప్రొటోకాల్ దర్శనాలు ప్రారంభం. అరోజు అధిక రద్దీ కారణంగా ఆలయంలో వేదాశీర్వచనం రద్దు. ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు స్వర్ణరథం.
వైకుంఠ ద్వాదశి రోజున ఉదయం 5.30 నుండి 6.30 వరకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం. గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన సదుపాయం ఉండదు.
ఉదయం 6 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు పంపిణీ చేయాలని కేటరింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
టీ, కాఫీ, పాలు, ఉప్మా, చక్కెర పొంగలి, పొంగలి పంపిణీ చేయాలని నిర్ణయం
భక్తులకు ప్రతిరోజు అందుబాటులో 3.50 లక్షల లడ్డూలు. అదనంగా 3.50లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ ఉంచాలని నిర్ణయించారు.