వైరాగ్యం

తొలి స్నానం, తెలియదు ఎవరికీ, స్వగృహంలోనో.. ఆస్పత్రుల్లోనో..
తుది స్నానం తెలిసే అవకాశం లేదు, అది ఆరుబయటే అయినా..
శిశువుకు వేడినీళ్లు పోసి, జాతకాల పరిశీలన
వేడినీళ్లతోనే వల్లకాడికి సాగనంపుతూ తప్పొప్పుల సమీక్ష
ప్రారంభంలో తెలియరాదు ఏ స్థాయికి చేరుతారో..
తుది అంకంలో అంతా బహిరంగమే సాధించిదేమిటో..
ఆనందంతో స్వాగతిస్తారు జనన సమయంలో..
ఆవేధనతో తుది వీడ్కోలు అంతిమ సంస్కారాలతో..
మళ్లీ వద్దనుకునేది ప్రసూతి వైరాగ్యం,
ఏదీ వెంటరాదనే మిట్టవేదాంతం శ్మశాన వైరాగ్యం..
ఎవరికీ తెలియని, చావు, పుట్టకల పరమార్థం ..
విశ్వవిజేతగా విర్రవీగిన అలెగ్జాండర్
శవపేటికతో చాటాడు చేతులు ఖాలీ అని…
జయలలిత మరో ఉదాహరణ ఏదీ వెంటరాదని..
అశాశ్వత జీవితమని అందరూ అంటారు..
అవనిపై అందరిదీ మూణ్ణాళ్ల ముచ్చటే..
మధ్యలోనే మమతాను బంధాలు, స్వార్థం
సంకుచితత్వం, ఆరాటం, ఆధికార లాలస
అందలం ఎక్కాలని, అక్కడే ఉండాలని, అంతా నాకేనని
సమభావం, సమధర్మం, సోదరభావం, సమానత్వం
సమసమాజం, ఎక్కడా దొరకని ఎండమావులే..
ఆత్మహత్యలు, హాహాకారాలు, దారిద్య్రం, నిరుద్యోగం
అంతులేని విషాధాలు, విలాపాలు..
విధివంచిత అభాగ్యులు, అన్నార్తులు ఎందరో..
స్థాయి, భావ భేదాలు లేని సమాజం
సుసాధ్యమవ్వాలనే ఆరాటంతో మనస్సు…
-కోనేటి రంగయ్య
సీనియర్ పాత్రికేయులు
తప్పక చదవండి:
తాలిబన్ అర్థం విద్యార్థి.. కానీ