విశాఖ చేరుకున్న వందే భార‌త్ రైలు..

విశాఖ‌ప‌ట్నం (CLiC2NEWS): వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ రైలు తొలిసారి విశాఖ‌కు చేరుకుంది. ఈ రైలు నిర్వ‌హ‌ణ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో భాగంగా రైల్యే స్టేష‌న్‌కు ర‌ప్పించిన‌ట్లు తెలుస్తోంది. ఈ రైలు అత్యంత వేగంతో ప్ర‌యాణిస్తుంది. అందువ‌ల్ల వైజాగ్ నుండి సికింద్రాబాద్‌కు 8.40 గంట‌ల్లోనే చేరుకుంటుంద‌ని అధికారులు తెలిపారు. ఈ రైలులో పూర్తికా చైర్‌కార్ బోగీలుంటాయి. ప్ర‌యాణికుల అత్య‌వ‌స‌ర స‌హాయం కోసం ఏర్పాటు చేసే ద్వారం వ‌ద‌ద్ద టాక్ బ్యాక్ స‌దుపాయాన్ని ఏర్పాటు చేశారు.

వందే భార‌త్ రైలును సికింద్రాబాద్‌-విశాఖ‌ప‌ట్నం, విశాఖ‌ప‌ట్నం-సికింద్రాబాద్ మ‌ధ్య న‌డ‌ప‌నున్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఈనెల 19వ తేదీన సికింద్రాబాద్‌లో ఈ రైలును ప్రారంభించ‌నున్న‌విష‌యం తెలిసిన‌దే. ఈ రైలు సికింద్రాబాద్ నుండి వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం, విజ‌య‌వాడ‌, రాజ‌మండ్రి మీదుగా విశాఖప‌ట్నం చేరుకుంటుందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.