వార‌ఫ‌లాలు (సెప్టెంబ‌రు 26-అక్టోబ‌రు 2)

మేష రాశి
(అశ్విని నక్షత్రం 4 పాదాలు ,భరణి నక్షత్రం 4 పాదాలు- కృత్తికా నక్షత్రం 1 వ పాదం )

ఈ రాశి వారు ఈ వారం అంతా కూడా ఆనందంగా ఉంటారు,ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి,మంచి పనులు చేసే అవకాశం లభిస్తుంది,స్థిరమైన ఆలోచనలు కలిగి ఉండాలి,కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది, నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి,ఆర్థిక స్థితి గతం కంటే మెరుగవుతుంది,ఉత్సాహంగా ఉంటారు, మిత్రుల అండ లభిస్తుంది, గృహ వాహనాది లాభాలు కలుగుతాయి. ఏకాగ్రతతో ప్రయత్నం చేయండి, కోరుకున్న జీవితం లభిస్తుంది.ఇంట్లో వాళ్ళతొ గొడవ పడరాదు కలుపుగోలుగా ఉండాలి,విసుగు చెందరాదు.వారాంతంలో మంచి జరుగుతుంది.

ఈ రాశి వారు శివారాధన చేయటం మంచిది.
లక్ష్మీ దేవిని సందర్శించండి,కుదిరితే బొబ్బర్లు దానం చేయండి సంపద పెరుగుతుంది.


వృషభరాశి
(కృత్తిక 2,3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1,2 పాదాలు)

ఈ రాశి వారికి మనోబలం విజయాన్ని సూచిస్తుంది, ధైర్యంగా ఉండాలి, చిత్తశుద్ధితో లక్ష్యాన్ని చేరండి,పనులు వాయిదా వేయవద్దు, సకాలంలో కార్యసిద్ధి ఉంటుంది, గందరగోళ స్థితి కలగకుండా చూసుకోండి, మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది, అనుకున్న ఫలితాలు పొందాలంటే శ్రమ అధికంగా చేయాలి, చిన్న చిన్న అవాంతరాల వస్తాయి సమర్ధవంతంగా ఎదుర్కోవాలి, పరిస్థితులను అర్థం చేసుకుంటూ వాటికి తగ్గట్టుగా స్పందించండి. ఉత్సాహం కార్య సిద్ధినిస్తుంది,ఓర్పుతో సంభాషించాలి. వారం మధ్య లో మంచి జరుగుతుంది

ఈ రాశి వారు లక్ష్మీ దేవి ఆరాధన చేయటం మంచిది.
సూర్యుణ్ని దర్శించండి,కుదిరితే బొబ్బర్లు దానం చేయండి ఆర్థిక స్థితి బాగుంటుంది.


మిధున రాశి
( మృగశిర నక్షత్ర 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదములు)

ఈ రాశి వారు బుద్ధి బలం తో విజయాన్ని సాధిస్తారు, అద్భుతమైన తెలివితేటలతో మంచి నిర్ణయాన్ని తీసుకొని విజయాన్ని సొంతం చేసుకుంటారు,ఉద్యోగం వ్యాపారంలో కలిసి వస్తుంది,
నూతన ఆలోచనల శక్తి వస్తాయి,కొత్త పరిచయాలు లాభిస్తాయి ,ఆర్థికంగా మంచి జరుగుతుంది, అయితే కొన్ని విషయాల్లో అవమానం ఎదురవుతుంది, ఉన్నట్టుండి తెలియని విఘ్నం ఒకటి ఎదురవుతుంది , సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఒక మెట్టు పైకి ఎక్కే అవకాశం ఉంటుంది, సుఖసంతోషాలతో ముందుకు సాగాలి ఆధ్యాత్మికంగా శక్తి పెరుగుతుంది, ధ్యానం అధికంగా చేయండి.

మహాగణపతి స్మరణ చేయండి, దత్తాత్రేయ స్వామి లేక నరసింహ స్వామిని దర్శించండి, శనగలు దానం చేయడం మంచిది.


కర్కాటక రాశి
(పునర్వసు నక్షత్రం 4 వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్ర 4 పాదాలు)

ఈ రాశి వారికి చాలా బాగుంది, శ్రేష్టమైన కాలం నడుస్తుంది,ఉద్యోగంలో అద్భుతంగా ఉంటుంది,అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి,అధికారుల అండ లభిస్తుంది, ధన ధాన్య యోగాలు పడతాయి, వ్యాపారంలో కలిసి వస్తుంది, ధైర్యం ఉత్సాహం పెరుగుతుంది,పదిమందికి మేలు చేసే అవకాశం ఏర్పడుతుంది,మొహమాటం వల్ల ఖర్చు పెరుగుతుంది ,చంచలత్వం లేకుండా ఆలోచించండి,కుటుంబ పరంగా ఆనందంగా ఉంటారు,ఆత్మవిశ్వాసం విశేషంగా ఉంటుంది,బంగారు భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలు లభిస్తాయి,దైవ శక్తి కాపాడుతుంది ధర్మచింతన తో ముందుకు వెళ్ళండి.

మహాగణపతి స్మరణ చేయండి,
నవగ్రహాల్లో చంద్రదర్శనం లేదా ప్రత్యక్షంగా చంద్రుని దర్శించండి, కొద్దిగా బియ్యం పేదలకు దానం చేయండి.


సింహ రాశి
(మఖ 4 పాదాలు,పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం)

ఈ రాశి వారికి మంచి కాలం నడుస్తుంది,మనోబలంతో లక్ష్యం సొంతమవుతుంది, బుద్ధిబలంతో వ్యాపారం విశేషంగా అభివృద్ధి చెందుతుంది,సౌఖ్య ప్రదంగా ఉంటుంది, కొన్ని సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుంది, ఉద్యోగంలో తగినంత గుర్తింపు లభిస్తుంది,విశాలమైన దృక్పథంతో నిర్ణయం తీసుకోండి త్వరగా విజయం పొందుతారు,సకాలంలో స్పందించండి,సకాలంలో స్పందించకపోతే కాలం వృధా అవుతుంది, మనసుకు ఏది అనిపిస్తే అది చేయండి,చిత్తశుద్ధి మిమ్మల్ని రక్షిస్తుంది,సరైన విధంగా నిర్ణయాన్ని తీసుకునే అవకాశం లభిస్తుంది, తోటివారి సహకారం సహాయాలు లభిస్తాయి,
సమిష్టి నిర్ణయాలు కలిసివస్తాయి, ప్రయాణాలు యోగిస్తాయి.

ఇష్టదేవతా స్మరణ చేయండి,గురువుగారిని దర్శించండి, లేదా నవగ్రహాల్లో గురు గ్రహాన్ని దర్శించండి
శనగలు దానం చేయండి.


కన్యా రాశి

(ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు)

మంచి కాలం నడుస్తుంది,మిత్రుల సహకారం లభిస్తుంది, సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి,గౌరవం పెరుగుతుంది,అభివృద్ధి విశేషంగా ఉంటుంది ,ఆర్థికంగా మేలు కలుగుతుంది,తెలియని విషయాల్లో వేలు పెట్టడం ద్వారా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి,గత వైభవం లభించాలంటే ఏకాగ్రతతో పని చేయండి,
నిరంతరమైన కృషి సాధనతో కొత్త విషయాలకై ప్రయత్నం చేస్తూ ఉండండి,సౌమ్య సంభాషణ మంచిది,కృషి ని బట్టి ఫలితం ఉంటుంది,కుటుంబపరంగా ఆనందం సిద్ధిస్తుంది.

ఆదిత్య హృదయం పఠించండి , సూర్యుని దర్శిస్తే మేలు కలుగుతుంది,కొద్దిగా నువ్వులు దానం చేయండి.


తులారాశి
(చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4పాదాలు, విశాఖా నక్షత్రం 1, 2, 3 పాదాలు)

మాట విలువ కాపాడుకోండి,అపార్థానికి అవకాశం ఉంది,తెలియని నిందలు పొందాల్సిన పరిస్థితి వస్తుంది, నిందలు మోపి వారు ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి,ఖ్యాతి తగ్గేటటువంటి అవకాశం ఉన్నది,మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి,తొందరపాటు పనికిరాదు,ఆలోచన తో పని చేయండి,ధైర్యంగా ముందుకు సాగండి,నిరుత్సాహం పనికిరాదు,తోటివారి సహకారం అందుతుంది,కష్టపడితే ఫలితం ఉంటుంది,ఆర్ధిక నష్టం వాటిల్లకుండా పొదుపుగా డబ్బు ఖర్చు చేయండి,కొత్త వారితో జాగ్రత్తగా ఉండండి,శాంతంగా మాట్లాడండి,ఉద్యోగంలో ఇబ్బందులు పెట్టే వారు ఉంటారు కాబట్టి జాగ్రత్త అవసరం, ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి, వ్యాపార రీత్యా కూడా అడుగడుగునా చాలా జాగ్రత్తగా ఉండండి.

లక్ష్మీదేవి స్తోత్రం పఠించండి,లక్ష్మీ దేవిని దర్శించండి,కొద్దిగా ధాన్యం నానబెట్టి ఆవుకు సమర్పించండి.


వృశ్చికరాశి
(విశాఖ 4 వ పాదం, అనూరాధ 4 పాదాలు, జ్యేష్ఠా 4 పాదాలు)

త్రికరణశుద్ధిగా ముందుకు సాగండి,సకాలంలో పనులు మొదలు పెట్టండి చాలా అనుకూలిస్తాయి,వ్యాపార లాభాలున్నాయి,
స్వల్ప ప్రయత్నంతోనే అద్భుతమైన విజయాలు సాధిస్తారు,చెడు ఊహించకండి,ధైర్యం అవసరం, ధర్మ మార్గంలో ముందుకు సాగితే అంతా మంచే జరుగుతుంది,బంధుమిత్రుల అండ అవసరం, ఒక ఆపద నుండి బయట పడతారు,స్వచ్ఛమైన భావజాలంతో మంచిని సాధించండి, ఎదురుచూస్తున్న పని ఒకటి ఒక అడుగు ముందుకు జరుగుతుంది,సమాజంలో గౌరవం పెరుగుతుంది ,కానీ కొన్ని సమస్యలు మనస్సును కలచి వేస్తాయి,కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండండి,ఆనంద ప్రదమైన జీవితం గడపండి.

ఇష్టదేవతా స్మరణ చేయండి,శ్రీరామచంద్ర మూర్తిని దర్శించండి కష్టాలు తొలగిపోతాయి ,శనగలు దానం చేయండి.


ధనస్సురాశి
(మూలా నక్షత్రం 4 పాదాలు,పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు,ఉత్తరాషాఢ నక్షత్రం1 వ పాదం)

ధనస్సు రాశి వారికి అద్భుతమైన శుభయోగం మొదలైంది,త్వరగా విజయాలు కలుగుతాయి,ఉత్సాహంగా పనులు మొదలు పెట్టండి అధ్భతమైన కార్యసిద్ధి కలుగుతుంది,
మంచి ఆలోచన విధానం తో విజయం సొంతం చేసుకోండి, ప్రశాంతంగా ముందుకు సాగండి.. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది,వ్యాపారస్తులు కూడా చాలా బాగుంటుంది,సముచితమైన నిర్ణయాలు తీసుకోవడం చేత సమస్యలు తొలగిపోతాయి,అపార్థాలకు అవకాశం ఉన్నది కాబట్టి జాగ్రత్తగా ఉండండి,సామరస్య ధోరణితో ఉంటే మంచిది,భూ గృహ వాహన యోగాలు బలపడతాయి,అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనులు చేసి ఆర్థికంగా లాభాలు పొందుతారు, వారం మధ్యలో ఒక ఆనందం కలుగుతుంది.

శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని స్మరించండి,దర్శించండి,కుదిరితే కొంచెం పెసలు దానం చేయండి.


మకర రాశి
(ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1,2 పాదాలు)

కాలం వ్యతిరేకిస్తుంది ,ప్రతి అడుగు శ్రద్ధగా వేయాలి, ముఖ్య కార్యాలు వాయిదా వేయడం మంచిది, ఆత్మీయుల సహకారం అవసరం,నిరాశ చెందకండి,అప్రమత్తంగా ఉంటూ సమస్యలను దూరం చేసుకోండి,ధనం ఖర్చు అవుతుంది,నిరుత్సాహం చెందకండి,నిరుత్సాహం చెందితే విఘ్నాలు పెరుగుతాయి,ఒంటరిగా ప్రయాణం చేయకండి, ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం,లక్ష్యంపై దృష్టి నిలపండి,వాదులకు ప్రతివాదులకు దూరంగా ఉండండి, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు,ఎవరేమన్నా పట్టించుకోకండి, మౌనంగా ఉండండి,ఏకాంతంగా ఉంటూ కొంత సమయం ధ్యానం చేయండి.

నవగ్రహ ధ్యాన శ్లోకాలు పఠించండి, నవగ్రహాలను దర్శించండి,
కొద్దిగా నవధాన్యాలు అగ్నికి సమర్పించండి మంచి జరుగుతుంది.


కుంభ రాశి
(ధనిష్ఠ నక్షత్రం 3,4 పాదాలు,శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2 , 3 పాదాలు)

మనోబలంతో విజయం కలుగుతుంది. శ్రమ తో ముందుకు సాగండి శుభ ఫలితాలు కనబడుతున్నాయి,శ్రమను బట్టి విజయం గోచరిస్తుంది,ఉద్యోగ పరంగా కష్టపడాలి,సమస్యలు ఒత్తిడి ఉంటాయి,సహనంతో వ్యవహరిస్తే ఆగిన పనులు పునః ప్రారంభం అవుతాయి,ఆర్థికంగా బాగుంటుంది,ఖర్చు పెరుగుతుంది,గృహ నిర్మాణ పనుల్లో పురోగతి ఉంటుంది,దైవానుగ్రహం చేత ఒక సమస్య నుండి బయట పడతారు,శత్రువుల నుండి వచ్చే ఇబ్బంది నుండి బయటపడడానికి సౌమ్యంగా సంభాషించండి,
అంతా మంచే జరుగుతుంది.

శ్రీ ఆంజనేయ స్వామిని స్మరించండి,
సూర్యుణ్ని దర్శించండి,కొద్దిగా గోధుమలు దానం చేయండి మంచి కలుగుతుంది.


మీన రాశి
(పూర్వాభాద్ర నక్షత్రం 4 వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు,రేవతీ నక్షత్రం 4 పాదాలు)

మనసుకు ధైర్యం లభిస్తుంది,అనుకున్న పనులు త్వరగా పూర్తి అవుతాయి,గౌరవ మర్యాదలు పెరుగుతాయి,ఉద్యోగంలో అభివృద్ధి గోచరిస్తుంది,లక్ష్యం సిద్ధిస్తుంది,బాంధవ్యాలు బలపడతాయి,నిర్మలమైన మనస్సుతో నిర్మాణాత్మకమైన
ఆలోచనలు కలుగుతాయి,ధన లాభం కలుగుతుంది,ఖర్చు కూడా వెంటాడుతుంది,ఆత్మవిశ్వాసం తగ్గరాదు,మన అవసరాలు మన ధైర్యం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సాధించాలనే నమ్మకంతో ముందడుగు వేయండి మంచి విజయం కలుగుతుంది, అపోహలు తొలగిపోతాయి. ఆనంద ప్రదంగా కాలంతో ముందడుగు వేయండి.

ఇష్టదేవతా ప్రార్ధన చేయండి,అమ్మవారిని దర్శించండి,కొద్దిగా చక్కెర చీమలకి పెట్టండి అంతా మంచే జరుగుతుంది.

-కంటాయ‌పాలెం ల‌క్ష్మ‌ణాచారి (అవ‌ధాని)
కృష్ణ య‌జుర్వేద పండితులు

Leave A Reply

Your email address will not be published.