ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌లు: ఓటు వేసిన ప్ర‌ముఖులు..

న్యూఢిల్లీ (CLiC2NEWS): భార‌త 16వ ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌లకు శ‌నివారం పోలింగ్ ప్రారంభ‌మైంది. పార్ల‌మెంటులో ఇవాళ ఉద‌యం 10 గంట‌ల‌కు ఓటింగ్ మొద‌ల‌వ్వ‌గా సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగింది. ఈ ఎన్నిక‌ల్లో ప‌లువ‌రు ప్ర‌ముఖులు ఓటు వేశారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ, ప‌లువురు ఎంపీలు రాహుల్ గాంధీ, శ‌శిథ‌రూర్‌, జైరాం ర‌మేష్‌, మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే హ‌ర్బ‌జ‌న్ సింగ్‌, హేమ‌మాలిని త‌దిత‌ర ఎంపీలు ఓటు వేశారు.

ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఎన్డీ యే అభ్య‌ర్థిగా జ‌దీప్ ధ‌న్‌క‌ర్‌, విప‌క్షాల అభ్య‌ర్థిగా మార్గ‌రేట్ అల్వాలు పోటీప‌డుతున్నారు. ఈ ఎన్నిక‌ల్లో మొత్తం 780 మంది ఎంపీలో ఓటింగ్‌లో పాల్గొన‌నున్నారు. దీంట్లో 543 మంది లోక్‌స‌భ‌, 245 మంది రాజ్య‌స‌భ ఎంపీలు ఉన్నారు. కాగా 36 మంది తృణ‌మూల్ ఎంపీలు ఓటింగ్‌కు దూరంగా ఉండ‌నున్నారు. రాజ్య‌స‌భ‌లో ఎనిమిది సీట్లు ఖాళీగా ఉన్నాయి. దీంతో 744 మంది ఎంపీలు ఓటు వేసే అవ‌కాశాలు ఉన్నాయి. కాగా సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంట‌నే కౌంటింగ్ మొద‌లు పెట్టి రాత్రి క‌ల్లా ఫ‌లితం వెల్ల‌డిస్తారు. కాగా ప్ర‌స్తుత ఉప‌రాష్ట్రప‌తి ఎం వెంక‌య్య‌నాయుడు ప‌ద‌వీకాలం ఆగ‌స్టు 10తో ముగియ‌నుంది. కొత్త‌గా ఎన్నికైన ఉప‌రాష్ట్రప‌తి ఈ నెల 11న ప్ర‌మాణం చేయ‌నున్నారు.

Leave A Reply

Your email address will not be published.