సముద్రంలో చేపల వేటపై 2 నెలల నిషేధం

విజయనగరం (CLiC2NEWS): సముద్రంలో మత్స్య సంపదను కాపాడేందుకు ఎపి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏప్రిల్ 15 నుండి జూన్ 14వరకు వేటపై నిషేధాజ్ఞలు జారీ చేసింది. చేపలు గుడ్లు పెట్టే సమయం కావున ప్రభుత్వం 2 నెలలు నిషేధం విధించింది. ఈ సమయంలో ఉపాధి కోల్పోనున్న మత్స్యకారులకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు అందిస్తోంది. మత్స్య భరోసా పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ. 10 వేలు సాయాన్ని అందిస్తుంది.