ఆర్‌టిసి బస్సు డ్రైవర్‌కు మూర్ఛ రావడంతో..

ఎస్ కోట (CLiC2NEWS): విజయనగరం జిల్లాలో ఆర్‌టిసి బస్సు ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. బస్సు నడిపే సమయంలో డ్రైవర్‌కు మూర్ఛ రావడంతో బస్సు రోడ్డు ప్రక్కనున్నఇంట్లోకి దూసుకెళ్లి ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బస్స ఢీకొని ఓ విద్యార్థి మృతి చెందాడు. బస్సు ఇంట్లోకి దూసుకుపోవడంతో గోడ కూలి మహిళకు గాయాలయ్యాయి. ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రయాణికులంతా సరక్షితంగా బయటపడ్డారు.