కాంగ్రెస్ ప్రచార, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్గా విజయశాంతి
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో కాంగ్రెస్ ప్రచార, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్ బాధ్యతలను విజయశాంతికి అప్పగించింది అధిష్టానం. రాష్ట్రంలోని శాసనసభ ఎన్కికలకు 15 మంది సభ్యులతో కూడిన ప్రచారం, ప్లానింగ్ కమిటీని కాంగ్రెస్ నియమించింది. కమిటీ కోఆర్టినేటర్ బాధ్యతలను తాజాగా పార్టీలోకి చేరిన విజయశాంతికి అప్పగించింది. ఆమె బిజెపి నుండి కాంగ్రెస్లోకి చేరిన సంగతి తెలిసిందే. కన్వీనర్లుగా పుష్ఫలీల, మల్లు రవి, సమరసింహారెడ్డి, నరేందర్ రెడ్డి, కోదండ రెడ్డి, రమేష్, యరపతి అనిల్, రాములు నాయక్, పిల్ల నాగేశ్వరరావు, ఒబేదుల్లా కొత్తవాల్, పారిజాతరెడ్డి, సిద్దేశ్వర్, రామ్మూర్తి నాయక్, అలీబిన్ ఇబ్రహీం, దీపక్జాన్ను ఉన్నారు.