17న ‘చలో విజయవాడ’కు అనుమతి లేదు.. 144 సెక్షన్ అమల్లో ఉంది.. సిపి
విజయవాడ (CLiC2NEWS): ఆగస్టు 17వ తేదీన విద్యుత్ ఉద్యోగుల పోరాట కమిటి చలో విజయవాడకు పిలుపునిచ్చింది. అయితే చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదని.. దానికి హాజరైన వారిపై కేసులు నమోదవుతాయని విజయవాడ సిపి కాంతిరాణా టాటా తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నాయన్నారు. విద్యుత్ సౌధ, బిఆర్టిఎస్ రోడ్డు ప్రాంతాలలో ప్రత్యేక సిసి కెమెరాలు ఉన్నాయని, నగరమంతా 3వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంకా .. విద్యుత్ సంఘ నేతలకు ఇప్పటికే నోటీసులు అందజేశామని సిపి తెలిపారు.