రోడ్డు ప్రమాదంలో వికారాబాద్ ఎస్ఐ మృతి..

నల్గొండ (CLiC2NEWS): వికారాబాద్ వన్‌టౌన్ ఎస్ఐ శ్రీను నాయక్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. శ్రీనునాయక్ తన తండ్రితో కలిసి ఆటోలో వెళ్తుండగా ఆర్టిసి బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరూ మృత్యవాత పడ్డారు. రంగారెడ్డి మాడుగుల మండలం మాన్యానాయక్ తండాకు చెందిన శ్రీనునాయక్ వికారాబాద్ ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ప్రొబేషనరి పిరియడ్ పూర్తిచేసుకొని ఎస్ఐ గా నియమితులయ్యారు. డిసెంబరు 26 వతేదీన తన వివాహం ఉండటంతో సెలవుపై సొంత గ్రామానికి వెళ్లారు. వివాహం జరిగిన నాలుగు రోజులకే శ్రీను నాయక్ మృతి చెందడంతో కుటుంబంలో విషాదం అలుముకుంది.