ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు తప్పవు : డిసిపి అఖిల్ మహాజన్
మంచిర్యాల (CLiC2NEWS): డిసిపి అఖిల్ మహాజన్ జిల్లా కేంద్రలోని సిసి కెమెరాల పనితీరును పరిశీలించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనదారులకు జరిమానాలు తప్పవని పేర్కొన్నారు. అనంతరం డిసిపి మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని సిసి కెమెరాలు డిస్ట్రిబ్యూటెడ్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్ మెంట్ సిస్టంతో కనెక్ట్ చేశామని.. ట్రాఫిక్ నిబంధనలు పాటించనట్లయితే జరిమానాలు వేయడం జరుగుతుందని అన్నారు. వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణించిన, ట్రిపుల్ రైడింగ్ చేసినా, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినా ఆటోమెటిగ్గా ఈచాలన్ ద్వారా జరిమానాలు పడతాయన్నారు. చట్ట ప్రకారం చర్యలు కూడా తీసుకుంటామన్నారు.