మే 15 నుండి శ్రీవారి దర్శనానికి విఐపి సిఫారసు లేఖలు స్వీకరణ..

తిరుమల (CLiC2NEWS): తిరుమలలో గురువారం నుండి శ్రీవారి దర్శనానికి విఐపి సిఫారసు లేకలు స్వీకరిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి తెలిపారు. వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ కారణంగా మే 1 నుండి జులై 15 వరకు సిఫారసు లేఖల బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టిటిడి ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజా ప్రతినిధులు, టిటిడి బోర్డు సభ్యుల సిఫార్సు లేఖలు చెల్లవని వెల్లడించింది. ఆ గడువును తగ్గించి ఎల్లుండి నుండి సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాలు ఉంటాయని మంత్రి తెలిపారు.