విశాఖ నవవధువు సృజన మృతి కేసు.. వీడిన చిక్కుముడి!
విశాఖపట్నం (CLiC2NEWS): నగరంలోని మధురవాడలో వధువు సృజన మృతి కేసులో చిక్కుముడి వీడింది. పెళ్లి ఆపాలనుకునే ప్రయత్నంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆమె ఆత్మహత్యకు కారణం ప్రేమవ్యవహారమేనని పోలీసులు నిర్ధారించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు. సృజన ఫోన్లో కాల్ డయల్ రికార్డర్, వాట్సాస్, ఇన్స్టాగ్రామలను విశ్లేషించగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
విశాఖలోని పరవాడకు చెందిన తోకాడ మోహన్ అనే యువకుడితో ఏడేళ్లుగా సృజనకు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. పెళ్లికి మూడు రోజుల ముందు మోహన్‌తో ఆమె ఇన్‌స్టాగ్రమ్‌లో ఛాటింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లో వాళ్లు చేస్తున్న పెళ్లి ఇష్టం లేదని .. తీసుకెళ్లాలని మోహన్‌ను సృజన కోరింది. ఆర్ధికంగా తాను ఇంకా స్థిరపడలేదని.. సరైన ఉద్యోగం లేదంటూ పెళ్లికి మోహన్ నిరాకరిస్తూ వచ్చాడు. కొంత సమయం కావాలని సృజనను కోరాడు.
సృజన కుటుంబసభ్యులు మే 11వ తేదీన వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఆ పెళ్లి ఇష్టం లేని సృజన.. దాన్ఇన ఆపేందుకు ప్రయత్నిస్తానని మోహన్‌కు హామీ ఇచ్చినట్లు సమాచారం. దీనిలో భాగంగానే ఆమె విషపదార్థం తీసుకుంది. కానీఊహించని రీతిలో పెళ్లిపీటలపై కుప్పకూలి పోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ కేసు వివరాలను పోలీసులు అధికారింగా వెల్లడించనున్నారు.