ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలై 11 మంది మృతి

జకార్తా (CLiC2NEWS): ఇండోనేషియాలోని సుమత్రా దీవిలో మౌంట్ మరపి లో ఉన్నఅగ్ని పర్వతం బద్ధలైంది. ఈ ఘటనలో 11 మంది పర్వతారోహకులు మృతి చెందినట్లు సమాచారం. మరో 12 మంది ఆచూకీ లభించలేదు. అగ్నిపర్వతం విస్ఫోటనం జరిగిన సమయంలో ఆప్రాంతంలో 75 మంది పర్వతారోహకలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి.. 49 మందిని కాపాడినట్లు తెలిపారు. గల్లంతైన వారికోసం సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. వారాంతం కావడంతో పర్వతారోహకులు అధిక సంఖ్యలో ట్రెక్కింగ్ చేసే సమయంలో పర్వతం ఒక్కసారిగా విస్ఫోటనం చెందింది. దీంతో ప్రాణనష్టం జరిగిందని అధికారులు తెలిపారు.