IND vs SRI: 14 ప‌రుగుల‌కే ఆరు వికెట్లు కోల్పోయిన శ్రీ‌లంక‌..

వాంఖ‌డె (CLiC2NEWS): ముంబ‌యిలోని వాంఖ‌డె స్టేడియంలో జ‌రుగుతున్న వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త్‌, శ్రీ‌లంక త‌ల‌ప‌డుతున్నాయి.

శ్రీ‌లంక 358 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బరిలోకి దిగింది. శ్రీ‌లంక బ్యాట‌ర్లుకు ఆదిలోనే షాక్ ఎదురైంది. ఇన్నింగ్స్ తొలి బంతికే నిశాంక‌, క‌రుణ‌ర‌త్నె వెనుదిరిగారు. నిశాంక ఎల్‌బిడ‌బ్ల్యూగా వెనిదిరగ‌గా.. సిరాజ్ వేసిన బంతికి క‌రుణ‌ర‌త్నె వికెట్ల ముందు దొరికిపోయాడు. 1.5 ఓవ‌ర్‌కు స‌మ‌ర విక్ర‌మ ఔట‌య్యాడు. దీంతో 2 ఓవ‌ర్ల‌కు శ్రీ‌లంక స్కోరు 2/3 చేసింది.

6 ఓవ‌ర్ల‌కు శ్రీ‌లంక నాలుగో వికెట్ కోల్పోయింది. సిరాజ్ వేసిన బాల్కు కుశాల్ మెండిస్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ష‌మి వేసిన 10వ ఓవ‌ర్‌లో మూడో బంతికి అస‌లంక జ‌డేజాకు క్యాచ్ ఇచ్చాడు. శ్రీ‌లంక సగం వికెట్లు కోల్పోయింది. 14 కు ఓవ‌ర్ల‌కే హేమంత ఔట‌వ్వ‌డం.. 6వ వికెట్ కూడా కోల్పోయి క‌ష్టాల్లోకి జారుకుంది.

ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 357 ప‌రుగులు చేసింది.

Leave A Reply

Your email address will not be published.