కాళేశ్వరంలో జలసవ్వడి

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ మణిహారం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నుంచి నీటిని రాత్రింబవళ్లు తరలిస్తుండటంతో కొత్త శోభను తెచ్చి పెడుతోంది. రాత్రి సమయంలో ఆరు మోటార్లు నీటిని ఎత్తిపోతే దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. ఎస్సారెస్పీ, మధ్య మానేరు, దిగువ మానేరుతో పాటు చెరువు, కుంటలను నింపాలని నీటిని ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి.