శ్రీశైలం, సాగర్ నుండి ఎపికి 4 టిఎంసిలు.. తెలంగాణకు 10.26 టిఎంసిల నీటి విడుదల

హైదరాబాద్ (CLiC2NEWS): వేసవిలో నీటి అవసరాల దృష్ట్యా శ్రీశైలం, సాగర్ నుండి తెలుగు రాష్ట్రాలకు నీటిని విడుదల చేయనున్నారు. ఎపికి 4 టిఎంసిలు.. తెలంగాణ రాష్ట్రానికి 10.26 టిఎంసిల నీటిని విడుదల చేయాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీశైలంలో 800 అడుగులు, సాగర్‌లో 505 అడుగుల వరకు నీటిని వినియోగించుకోవచ్చని తెలిపింది. ఎపి అవసరాల నిమిత్తం సాగర్ కుడి కాల్వ నుండి రోజుకు 5,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని నిర్ణయించింది. అంతేకాక శ్రీశైలంలో జులై నెలాఖరు వరకు 800 అడుగుల కనీస మట్టం కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.