నగరంలో రేపు పలు ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని పలు ప్రాంతాల్లో రేపు తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుందని జలమండలి అధికారులు ప్రకటనలో తెలిపారు. కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్-2 లోని పంప్ హౌజ్ లో మరమ్మతుల కారణంగా పలుచోట్ల పూర్తిగా.. మరికొన్ని ప్రాంతాలలో పాక్షికంగా నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. కావున అంతరాయం ఏర్పడనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని కోరడమైనది.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు
NPA, మిరాలం, బాలాపూర్, మైసారం, బార్కాస్ భోజగుట్ట, ఆళ్లబండ, మేకలమండి, భోలక్ పూర్, చిలకల గూడ, తార్నాక, లాలాపేట్, బౌద్ధ నగర్, మారేడ్ పల్లి, కంట్రోల్ రూమ్, రైల్వేస్, MES, కంటోన్మెంట్, ప్రకాశ్ నగర్, పాటిగడ్డ, హస్మత్ పేట్, ఫిరోజ్ గూడ, గౌతమ్ నగర్, వైశాలి నగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, అల్కపురి కాలనీ, మహీంద్ర హిల్స్, ఏలుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిల్కా నగర్, బీరప్పగడ్డ, బుద్వేల్, శాస్త్రిపురం, మీర్ పేట్, బడంగ్ పేట్, శంషాబాద్.