ఆరునూరైనా దళిత బంధు అమలు చేస్తాం: ముఖ్యమంత్రి కెసిఆర్

హైదరాబాద్ (CLiC2NEWS): ఆరునూరైనా నూటికి నూరు శాతం దళిత బంధును అమలుచేసి తీరుతమని తెలంగాణ సిఎం కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. దళితుల అభివృద్ధి కోసమే మహాయజ్ఞంలా దళితబంధును చేపట్టినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి శుక్రవారం టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్‌లో సిఎం మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడం చాలా సంతోషం అన్నారు. ప్రజాసంక్షేమంలో భాగస్వామ్యం కావడానికే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు.