నీరవ్ మోదీ.. విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగిస్తాం..
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

న్యూఢిల్లీ (CLiC2NEWS): భారతదేశం కోరుతున్న నిరవ్ మోదీ.. విజయ్ మాల్యాను అతి తొందరగా భారత్‌కు అప్పగించేందుకు తాము సిద్దంగా ఉన్నామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. శుక్రవారం ప్రధాని మోడీతో సమావేశం అనంతరం బ్రిటన్ ప్రధాని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు నీరవ్ మోడీ, విజయ్ మాల్యాల అప్పగింతకు సంబంధించి అడిగిన ప్రశ్నకు జాన్సన్ సమాధానమిస్తూ.. విచారణ కోసం వారిని తిరిగి భారతదేశానికి అప్పగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. భారత్ చట్టాల నుంచి తప్పించుకొని.. తమ దేశ చట్టాలను వాడుకోవాలని చూసే వారిపై తాము కఠినంగా ఉంటామని జాన్సన్ స్పష్టం చేశారు.