Janagama: ప్రజా విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరిస్తాం: కలెక్టర్ శివలింగయ్య
జనగామ (CLiC2NEWS): ప్రజా విజ్ఞప్తులను సమగ్రంగా పరిశీలించి సత్వరమే పరిష్కరిస్తామని జనగామ జిల్లా కలెక్టర్ శివలింగయ్య తెలిపారు. సోమవారం గ్రీవెన్స్ డే పురస్కరించుకుని కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంను కలెక్టర్ జిల్లా అధికారులతో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుండి పలు విజ్ఞప్తులను స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి దరఖాస్తును తప్పనిసరిగా పరిష్కరిస్తామని, అర్హులకు న్యాయం చేకూరుస్తామన్నారు. ఉపాధిహామీ పనులు పెంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు మాత్రమే హాజరు కావాలన్నారు. ఈ గ్రీవెన్స్ డే లో అదనపు కలెక్టర్ లు భాస్కర్ రావు , అబ్దుల్ హమీద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.